News April 7, 2025
వరంగల్: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యం

వరంగల్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు నుంచి జారి పడి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైనట్లు వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపారు. హంటర్ రోడ్డులోని శాయంపేట గేట్ సమీపాన గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే 9441557232, 8712658585 నంబర్లకు కాల్ చేయాలన్నారు.
Similar News
News April 9, 2025
ప్రపంచంలో అత్యంత విలువైన ఎయిర్‌లైన్ కంపెనీగా ‘ఇండిగో’

ఇండియాలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన ‘ఇండిగో’ అరుదైన ఘనత సాధించింది. మార్కెట్ క్యాపిటల్ ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన ఎయిర్‌లైన్ కంపెనీగా అవతరించింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ను ఇండిగో అధిగమించింది. ఇండిగో షేర్ ప్రైస్ ఇవాళ రూ.5,265కు చేరడంతో మార్కెట్ క్యాపిటల్ 23.24 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. కాసేపటికి 23.16 బి.డా.కు తగ్గడంతో డెల్టా మళ్లీ టాప్ ప్లేసుకు వెళ్లింది.
News April 9, 2025
నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో దుద్యాల మండలం హకీంపేట, లగచర్లకు సంబంధించిన స్వంత పట్టా భూములు కలిగిన రైతులకు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తహశీల్దార్ కిషన్లతో కలిసి రైతులకు నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.
News April 9, 2025
HSRP నంబర్ ప్లేట్లు అంటే..

*అల్యూమినియం, రెట్రో రిఫ్లెక్టివ్ షీట్లు ఉపయోగించి నాన్-టాంపరబుల్ డిజైన్‌లో రూపొందిస్తారు. ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటాయి.
*దొంగిలించినా ఈజీగా వాహనాలను ట్రాక్ చేయవచ్చు.
*రాత్రిపూట కాంతిని ప్రతిబింబిస్తాయి కాబట్టి రోడ్డు భద్రతలో సహాయపడుతుంది.
*ఇందులోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్‌లో వాహన సమాచారం స్టోర్ అవుతుంది. దీని ద్వారా నంబర్ ప్లేట్‌ను ఈజీగా స్కాన్ చేయవచ్చు.