News October 9, 2025
వరంగల్: రైలు బాత్ రూంలో ప్రయాణికుడి మృతి

కాజీపేట సిద్ధార్థ నగర్ చెందిన మరెల్లి సుజిత్ గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బాత్ రూంలో గుండె పోటుతో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. HYD నుంచి వెళ్తుండగా జనగామ సమీపంలో S2 బోగిలో మరుగుదొడ్డి వెళ్లాడు. మరుగుదొడ్డిలో సుజిత్ పడిపోయి ఉండటంతో తోటి ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి కాజీపేటలో బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
Similar News
News October 9, 2025
JNG: పేరెంట్స్ GREAT.. ఆరుగురి ప్రాణాలు నిలబెట్టారు

రఘునాథపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన గాదె యుగంధర్(29) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో అతని తల్లిదండ్రులు కుమారుని అవయవాలు దానం చేసి ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, రెండు కళ్లు వేరు చేసి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రాణదానం చేశారు.
News October 9, 2025
ఎన్నికల సిత్రాలు షురూ: ఎర్రగడ్డలో మిర్చి బజ్జీ వేసి!

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల సిత్రాలు మొదలయ్యాయి. ఓటర్లను ఆకర్షించే పనిలో BRS అభ్యర్థి మాగంటి సునీత తన దైన శైలిలో వెళుతున్నారు. బుధవారం సాయంత్రం ఎర్రగడ్డ డివిజన్‌లోని బి.శంకర్‌లాల్‌నగర్, సుల్తాన్‌నగర్‌లో కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావుతో కలిసి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా ఓ హోటల్ వద్ద మిర్చి బజ్జీలు వేశారు. ఉప ఎన్నిక ప్రచారం ముగింపు వరకు ఇంకెన్ని సిత్రాలు ఉంటాయో చూడాలి.
News October 9, 2025
జీవ ఎరువుల వాడకంతో కలిగే ప్రయోజనాలు

పంటకు <<17939337>>జీవ ఎరువు<<>>లను అందించడం వల్ల హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై అవి ఆరోగ్యకరంగా, వేగంగా పెరుగుతాయి. నేల నుంచి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టవచ్చు. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి భూసారం పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం 20 నుంచి 25 శాతం మేర తగ్గించుకోవచ్చు. జీవ ఎరువుల వల్ల పంట సాధారణ దిగుబడి 10 నుంచి 20 శాతం వరకు పెరుగుతుంది. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.