News April 30, 2024
వరంగల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. జల్లి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ వైస్ ఛైర్మన్ చెన్నారెడ్డి, ఆయన తల్లి విజయ మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అమీనాబాద్ శివారులో బైక్‌కు కుక్క అడ్డురావడంతో కింద పడ్డారు. ప్రమాదంలో విజయ అక్కడికక్కడే మృతి చెందగా, చెన్నారెడ్డికి గాయాలయ్యాయి.
Similar News
News January 12, 2025
ఉమ్మడి వరంగల్ క్రైం న్యూస్
> JN: తీగారంలో గంటల వ్యవధిలో దంపతుల మృతి> > ఇంటర్ విద్యార్థిని సూసైడ్> సూసైడ్ > షాక్ తో కాడేడ్లు మృతి > WGL: > బెట్టింగ్.. ఆన్లైన్ సూసైడ్> NSPT: చిన్నారిపై పిచ్చికుక్క దాడి> JN: ఇసుక అక్రమ > కేసు నమోదు> MHBD: పూసల తండా శివారులో > నల్లబెల్లం పట్టివేత> WGL: గుట్కా విక్రయం.. అరెస్టు >
News January 11, 2025
పాలకుర్తి: గంటల వ్యవధిలో దంపతుల మృతి
గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన బైకాని సోమక్క శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది. భార్య మరణ వార్త తెలుసుకొని షాక్‌కు గురైన భర్త కొమురయ్య సైతం ఈరోజు ఉదయం చనిపోయారు. గంటల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
News January 11, 2025
వరంగల్: నకిలీ వైద్యులున్నారు.. పారా హుషార్..!
ఉమ్మడి WGL జిల్లాలో నకిలీ డాక్టర్ల వైద్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. NSPTలో పిల్లలు పుట్టేందుకు నకిలీ వైద్యుడి ట్రీట్మెంట్‌తో ఓ మహిళ అస్వస్థతకు గురికాగా స్థానికులు పట్టుకున్నారు. ఇలానే.. WDPTలో ఒక ఆటో కార్మికుడు, WGLలో ఆపరేషన్ చేస్తూ ఒకరు, CHPTలో హెర్బల్ మందుల పేరుతో మహిళ మృతి చెందిన ఘటనలు జరిగాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో సుమారు 60కి పైగా నకిలీలను గుర్తించారు.