News September 13, 2025

వరంగల్: లోక్ అదాలత్‌లో 5,938 కేసుల పరిష్కారం

image

జాతీయ లోక్ అదాలత్‌లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 10 బెంచీలలో మొత్తం 5,938 కేసులు పరిష్కారమయ్యాయి. పరిష్కారమైన కేసుల్లో 26 సివిల్ కేసులు, 24 MVOP కేసులు, 5,912 క్రిమినల్ కేసులు, 76,720 బ్యాంక్ PLC కేసులు ఉన్నాయి. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డేవిడ్ రాజ్‌కుమార్ కక్షిదారులకు 300 పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 14, 2025

రాజమండ్రి: లోక్‌ అదాలత్‌లో 4,733 కేసులు పరిష్కారం

image

రాజమండ్రిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 4,733 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ఇన్‌‌ఛార్జ్‌ జడ్జి మాధురి ఈ వివరాలను వెల్లడించారు. ఈ కేసుల ద్వారా బాధితులకు రూ.16.35 కోట్లకు పైగా పరిహారం అందనుంది. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.

News September 14, 2025

శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన

image

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రానున్న మూడు రోజులు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంద్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రం మీద వేటకు వెళ్లవద్దని సూచించారు. అల్ప పీడన ప్రభావం వలన సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడతాయని హెచ్చరించారు.

News September 14, 2025

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సింగరేణి సంస్థ

image

సింగరేణి సంస్థ మహిళా సాధికారత దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎండీ బలరామ్ ఆదేశాల మేరకు ఇకపై ఓసీలో మహిళా ఆపరేటర్లు, జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఓసీల్లో యంత్రాలను నడిపే ఆపరేటర్లుగా పనిచేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.