News April 4, 2024
వరంగల్: వదినతో మరిది కాపురం

వదినును తల్లిని చేసి వదిలేసిన దుర్మార్గపు ఘటన ఇది. నల్లబెల్లి చిన్నతండాకు చెందిన రాజుకు చెన్నరావుపేట(M)కు చెందిన మమతతో 2017లో పెళ్లైంది. రాజుకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో మరిది శ్రీనుతో పిల్లలు కంటే ఆస్తి మనదేనని అత్తామామలు నమ్మబలికారు. ఈక్రమంలో శ్రీను, మమతకు ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత మమతతో గొడవపడి పుట్టింటికి పంపేశారు. శ్రీను వేరే పెళ్లికి రెడీ కావడంతో మమత పోలీసులను ఆశ్రయించింది.
Similar News
News February 20, 2026
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: డీఐఈఓ శ్రీధర్ సుమన్

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ల (డీఓ)తో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 6,003 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
News February 20, 2026
నెక్కొండలో ఇద్దరు ఉపాధ్యయులు సస్పెండ్

వరంగల్ జిల్లా నెక్కొండ మండల పరిధిలో పని చేస్తున్న ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో రంగయ్య శుక్రవారం ఉత్తర్వులు జరీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న అంకం ప్రవీణ్ కుమార్, రామారపు రవి సస్పెండ్ అయ్యారు. ప్రవీణ్ కుమార్ అజ్మీర మంగ్యా తండా MPPS, రవి గొట్లకొండ MPPSలలో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు.
News February 19, 2026
మిర్చి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

మార్కెట్‌లో మిర్చికి మంచి ధరలు ఉన్నప్పటికీ, రైతులు నాణ్యతపై దృష్టి పెట్టకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. ఎనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి సీజన్ పరిస్థితులపై ఆమె సమీక్ష నిర్వహించారు. తేమతో కూడిన మిర్చిని తీసుకురావడం వల్ల రంగు మారి నాణ్యత దెబ్బతింటోందని, ఫలితంగా విదేశీ వ్యాపారులు కొనుగోలుకు విముఖత చూపుతున్నారని పేర్కొన్నారు.


