News April 9, 2025
వరంగల్: వారు దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో పని చేస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులు జులై- 2025లో ప్రైవేట్ అభ్యర్థులుగా ఐటీఐ పరీక్షలు రాసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏటూరునాగారం ఐటీఐ ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లలో 3 ఏళ్లు పైబడిన సర్వీస్ సర్టిఫికెట్, ఎంప్లాయ్ గుర్తింపు కార్డు సమర్పించి ములుగు రోడ్డు వరంగల్ కార్యాలయంలో ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 20, 2025
VJA: రూ.478 కోట్లతో PPP విధానంలో రహదారుల అభివృద్ధి

రాష్ట్రంలోని ప్రధాన నగరాల రహదారుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో విజయవాడ, విశాఖలో ప్రైవేట్ భాగస్వామ్యం (PPP)తో రూ.478 కోట్లతో 112 K.M మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ‘యాన్యుటీ మోడల్’లో చేపట్టే ఈ ప్రాజెక్టులో రోడ్లతో డ్రైనేజీ, వీధి లైట్లు, పార్కింగ్, ఫుట్‌పాత్ వంటి వసతులు కల్పించనున్నారు. 10ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత గుత్తేదారు సంస్థలదేనని ప్రభుత్వం తెలిపింది.
News December 20, 2025
ప్రియుడితో గదిలో యువతి.. తండ్రి రావడంతో..

TG: సంగారెడ్డి(D) కొల్లూరులో విషాదం చోటు చేసుకుంది. HYD పాతబస్తీకి చెందిన వ్యక్తికి కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవగా ఖాళీగా ఉంటోంది. నిన్న ఆయన కూతురు(20), ప్రియుడితో కలిసి అక్కడి ఇంటికి వెళ్లింది. అదే సమయంలో ఆమె తండ్రి కూడా అక్కడికి వచ్చారు. దీంతో తీవ్రంగా భయపడ్డ ప్రేమ జంట బాల్కనీ నుంచి పక్క ఫ్లాట్‌కి వెళ్లాలని ప్రయత్నించింది. యువతి కాలు జారి 8వ అంతస్తు నుంచి పడి మరణించింది.
News December 20, 2025
వజ్రపుకొత్తూరు: బీచ్‌లో వెనక్కి వెళ్లిన సముద్రం

వజ్రపుకొత్తూరు మండలంలోని శివ సాగర్ బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఒక్కసారిగా 50 మీటర్ల మేర వెనకకు వెళ్లడంతో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి తోడు ఎంతో తక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.


