News September 6, 2025
వరంగల్ వాసికి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ వాసికి నేషనల్ బెస్ట్ టీచర్స్ అవార్డు వరించింది. హన్మకొండ 57వ డివిజన్ గోకుల్ నగర్ వాస్తవ్యురాలు నక్క స్నేహలత యాదవ్ శుక్రవారం ఢిల్లీలో మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ & ఎంటర్ప్యనర్షిప్ గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆమె NAC సీనియర్ ఫాకల్టీగా పనిచేస్తున్నారు.
Similar News
News September 6, 2025
HYD: ఉత్తమ టీచర్‌గా స్నేహలత

మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ తరపున నిర్మాణ రంగంలో HYD NAC టీచర్ స్నేహలతను జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు వరించింది. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జాతీయ ఉత్తమ టీచర్ అవార్డును ఆమెకు అందజేసి అభినందించారు. తనకు ఇంత గొప్ప గౌరవం దక్కటం గర్వంగా ఉందని స్నేహలత తెలిపారు.
News September 6, 2025
UPDATE: సాగర్ కాలువలో కొట్టుకుపోయిన తండ్రీకొడుకులు వీరే

వేములపల్లి మండలం సాగర్ ఎడమ కాలువలో తండ్రీకొడుకులు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు కాలువలో జారిపడిన సాంబయ్య (45), శివసాయి(20)లను గజ ఈతగాళ్లు రక్షించేందుకు యత్నించినా వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే, డీఎస్పీ పరిశీలించారు.
News September 6, 2025
గోదావరి నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి 9,00,814 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.20 అడుగులకు చేరిందని, ఎగువ ప్రాంత ప్రవాహాలు తగ్గుముఖం పట్టడంతో నీటి స్థాయి క్రమంగా తగ్గుతుందన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 12,700 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నామని తెలిపారు.