News February 27, 2025

వరంగల్: విద్యార్థిని ఆత్మహత్య.. UPDATE

image

WGL నగరంలో ఉరేసుకొని బుధవారం <<15587387>>విద్యార్థిని ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన రేష్మిత WGL ములుగు రోడ్డులోని వ్యవసాయ విద్యాలయంలో ఫస్టియర్ చదువుతోంది. విద్యార్థినికి ఇంటిపై బెంగ ఉండటంతో అప్పుడప్పుడు తల్లి ఆమెతో పాటు హాస్టల్‌లో ఉండేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కాగా, నిన్న శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెల్లగా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Similar News

News October 17, 2025

VKB: జిల్లా బీజేపీ కన్వీనర్‌గా కరణం ప్రహ్లాద రావు

image

వికారాబాద్ జిల్లా బీజేపీ కన్వీనర్‌గా కరణం ప్రహ్లాద రావు శుక్రవారం నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి కొప్పు రాజశేఖర్ రెడ్డి సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. అదేవిధంగా జిల్లా బీజేపీ కన్వీనర్‌గా కరణం ప్రహ్లాద రావును నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని అన్నారు.

News October 17, 2025

JNTUH విద్యార్థులకు ALERT

image

కూకట్‌పల్లిలోని JNTU 14వ స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 2024- 25 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి UG, PG, PHD పూర్తైన విద్యార్థులు డిగ్రీల కోసం నవంబర్ 30లోపు వర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు సూచించారు.

News October 17, 2025

కురుమూర్తి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన గోడపత్రికను శుక్రవారం మక్తల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, మంత్రులకు, జిల్లా ఎమ్మెల్యేలకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో వీర్లపల్లి శంకర్, దేవరకద్ర మత్స్యశాఖ ఛైర్మన్ మెట్టా సాయి కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.