News July 5, 2025

వరంగల్: విమానం ఎగురేది డౌటే!

image

WGL ఎయిర్పోర్ట్ భూముల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఈఏడాది చివర్లో రన్ వే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్‌కు 696 ఎకరాల భూమి ఉండగా రైతుల నుంచి మరో 253 ఎకరాలు సేకరించాలి. ఎకరాకు రైతులు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం రూ.1.20 కోట్లు ఇస్తామని చెప్పినా వినట్లేదు. సర్వే చేసిన భూముల్లో సాగు చేయవద్దని నోటీసులు ఇచ్చినా రైతులు మాత్రం వానాకాలం సాగు చేస్తున్నారు.

Similar News

News July 5, 2025

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 108.2 మి.మీ వర్షపాతం

image

గడిచిన 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 108.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా చూస్తే మహదేవ్‌పూర్ 9.2 మి.మీ, పలిమెల 32.8, మహముత్తారం 42.4, కాటారం 3.6, మల్హర్ 10.4, చిట్యాల 3.2, టేకుమట్ల 1.0, రేగొండ 1.4, భూపాలపల్లి 4.2 మి.మీ.లుగా నమోదైంది.

News July 5, 2025

పల్నాడు: మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

image

ఇటీవల తగ్గిన కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట రైతు బజార్లలో కిలో రూ.18 ఉన్న టమాటా శనివారానికి రూ.35కి చేరింది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంది. పచ్చిమిర్చి రూ.38, వంకాయ రూ.36, దొండ రూ.38, బెండ రూ.27 పలుకుతున్నాయి. మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News July 5, 2025

ప్రభుత్వ సలహాదారునిగా పి.గన్నవరం వాసి బాధ్యతలు

image

పి. గన్నవరంలోని ఊడిమూడికి చెందిన జనసేన పార్టీ నాయకుడు పెన్నమరెడ్డి నాగబాబు ఇటీవల అటవీ శాఖ ఐటీ ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలోని సచివాలయం వద్ద శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. తనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు కృషి చేస్తానని నాగబాబు తెలిపారు.