News January 7, 2026

వరంగల్: వీడని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మిస్టరీ

image

మామునూరులోని అద్దె ఇంట్లో ఉంటూ ఉరేసుకుని మృతి చెందిన <<18773300>>బీటెక్ విద్యార్థి మేడం వంశీ వర్మ ఆత్మహత్య<<>> మిస్టరీ వీడలేదు. బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న వంశీ ఇటీవల స్వగ్రామం నుంచి తిరిగి వచ్చి, ఈ నెల 5న ఉదయం తల్లితో మాట్లాడిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. కారణాలు తెలియరాకపోవడంతో పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 12, 2026

NZB: నాలుగు కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్: సీపీ

image

నిజమాబాద్‌లో జరిగిన 2వ సాధారణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఈ మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ సాయి చైతన్య గురువారం తెలిపారు. మొత్తం నాలుగు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్(బాలుర, నిజామాబాద్), విజయ మేరీ హైస్కూల్(బోధన్), ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పిప్రి, ఆర్మూర్), ప్రభుత్వ జూనియర్ కళాశాల(భీమ్‌గల్)లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వివరించారు.

News February 12, 2026

IPLలో అన్‌సోల్డ్.. PSLలో ఖరీదైన ప్లేయర్

image

IPL వేలంలో అన్‌సోల్డ్‌గా మిలిగిన స్టీవ్ స్మిత్‌కు PSLలో రికార్డు స్థాయి ధర లభించింది. లీగ్ హిస్టరీలోనే అత్యధికంగా PKR 14 కోట్ల(₹4.54Cr)కు ఆయనను సియాల్‌కోట్ స్టాలియన్స్ సొంతం చేసుకుంది. బౌలర్ నసీమ్‌ను PKR 8.65 కోట్లకు, అష్రఫ్‌ను PKR 8.5 కోట్లకు ఇస్లామాబాద్ కొనుగోలు చేసింది. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్‌కు పెషావర్ టీమ్ PKR 7 కోట్లే వెచ్చించడం గమనార్హం. మార్చి 26 నుంచి మే 3 వరకు 8 జట్లతో PSL జరగనుంది.

News February 12, 2026

GNT: విద్యార్థుల మధ్య గొడవ.. ఏడుగురి అరెస్ట్

image

గుంటూరు జిల్లా చేబ్రోలు పీఎస్‌ పరిధిలో ఓ యూనివర్సిటీ ఫెస్ట్ సందర్భంగా జరిగిన దాడి కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సహ విద్యార్థి భరత్‌ను సపోటా తోట వద్దకు పిలిచి కర్రలు, ఇనుప రాడ్లు, నన్‌చక్‌లతో దాడి చేసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి రెండు కర్రలు, ఒక నన్‌చక్ స్వాధీనం. యువత కోపావేశాలకు లోనుకాకుండా, చట్టపరమైన మార్గాలను అనుసరించాలని పోలీసులు కోరారు.