News December 8, 2025
వరంగల్: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. MHBD(D)లోని అబ్బాయిపాలెంకు చెందిన సత్యం(60) కల్లు గీస్తున్న క్రమంలో ఈతచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఉనికిచర్ల సమీపంలో బైక్ కల్వర్టులోకి దూసుకెళ్లి ధర్మసాగర్(M)కి చెందిన యోగేశ్వర్ మృతి చెందాడు. NSPT(M) రాజేశ్వరరావుపల్లి <<18497665>>మాజీ సర్పంచ్<<>> యువరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. వీధికుక్కల దాడిలో 8 గొర్రెలు మృతిచెందిన ఘటన కంబాలపల్లిలో జరిగింది.
Similar News
News December 10, 2025
చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.
News December 10, 2025
పెంబి: తెప్పపై తరలివెళ్లిన ఎన్నికల సిబ్బంది

ఈ నెల 11న నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మసరత్ ఖానం పెంబి మండలాన్ని సందర్శించారు. సిబ్బంది ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు తరలివెళ్లారు. యాపాల్ గూడకు వెళ్లాల్సిన సిబ్బందిని గ్రామంలోని నది వద్ద తెప్పపై సామగ్రితో దగ్గరుండి తరలించారు.
News December 10, 2025
మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.?

కృత్తివెన్ను మండలం అడ్డపర్రకు చెందిన ఓ మహిళ (55) స్క్రబ్ టైఫస్ అనుమానిత లక్షణాలతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. జ్వరం, శరీర నొప్పులతో ఆసుపత్రికి తరలించగా, పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఉన్నట్లు సమాచారం. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.


