News April 7, 2025
వరంగల్: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.
Similar News
News April 15, 2025
సీతానగరం: ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు గాయాలు

సీతానగరంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అంటి పేట గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న గాడి లక్ష్మీని అప్పయ్య పేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌తో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రురాలిని పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు.
News April 15, 2025
Intermediate: సంస్కృతంతో తెలుగుకు దెబ్బేనా?

TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని రెండోభాషగా ప్రవేశపెట్టాలన్న ఇంటర్మీడియట్ అధికారుల నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల్లో 90% మంది విద్యార్థులు ఎక్కువ మార్కులు వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకుంటున్నారు. టెన్త్ వరకు తెలుగు చదివిన విద్యార్థులు ఇంటర్‌లో సంస్కృతాన్ని తీసుకుంటే తెలుగు భాషకు తీవ్ర నష్టం జరుగుతుందని విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 15, 2025
HYD: అర్ధనగ్న నృత్యాలు.. 17 మంది యువతులు అరెస్ట్

HYDలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్‌లో రైడ్స్ చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో ఇలా చేయించడం గమనార్హం. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.