News April 7, 2025

వరంగల్: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

image

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.

Similar News

News January 27, 2026

ఏలూరు: అడవి బాట పట్టిన పెద్దపులి

image

గత పక్షం రోజులుగా బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాలను బెంబేలెత్తించిన పెద్దపులి ఎట్టకేలకు అభయారణ్యం వైపు మళ్లింది. లంకపల్లి వద్ద పులి తాజా పాదముద్రలను గుర్తించినట్లు కన్నాపురం అటవీశాఖాధికారి భాను‌ప్రకాశ్ మంగళవారం ధ్రువీకరించారు. మరో రెండు రోజుల్లో పులి పూర్తిగా అభయారణ్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారని అధికారులు తెలిపారు.

News January 27, 2026

KNR: బస్టాండ్ ఆవరణలో శ్రీ మేడారం జాతర క్యాంపు

image

మేడారం జాతర భక్తుల కోసం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపును రీజినల్ మేనేజర్ బి.రాజు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని 6 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సర్వీసుల్లోనూ మహిళలకు ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందన్నారు. ఇతర భక్తులకు పెద్దలకు రూ.390, పిల్లలకు రూ.220 చొప్పున ఛార్జీలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

News January 27, 2026

బంగ్లాకు మళ్లీ షాకిచ్చిన ఐసీసీ

image

భద్రతా కారణాలతో ఇండియాలో T20 WC <<18949789>>ఆడబోమన్న<<>> బంగ్లాదేశ్‌కు ICC మరోసారి షాక్ ఇచ్చింది. ఆ దేశ జర్నలిస్టులకు మీడియా అక్రెడిటేషన్లు నిరాకరించింది. ‘ఇండియాకు వెళ్లడం సురక్షితం కాదని బంగ్లా ప్రభుత్వం చెబుతోంది. అందుకే అక్కడి జర్నలిస్టులకు వీసాలు/అక్రెడిటేషన్లు ఇవ్వలేదు’ అని ఓ ICC అధికారి చెప్పినట్లు NDTV తెలిపింది. 130-150 మంది జర్నలిస్టులు అప్లై చేసుకోగా ఒక్కరికీ ఐసీసీ పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం.