News November 21, 2025

వరంగల్: వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి: సీపీ

image

శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సీపీ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలమన్నారు.

Similar News

News November 23, 2025

GDK: డిసెంబర్‌ 13న జాతీయ లోక్‌ అదాలత్‌

image

డిసెంబర్‌ 13న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి డాక్టర్‌ టీ.శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా అదనపు న్యాయ స్థానంలో లోక్‌ అదాలత్‌ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పలు కేసుల్లో నిందితులు రాజీ కుదుర్చుకునేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు, పోలీసు శాఖ అధికారులున్నారు.

News November 23, 2025

స్వచ్ఛ ఏలూరు లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి

image

ఏలూరు జిల్లా అని స్వచ్ఛ ఏలూరు జిల్లాగా రూపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ బహిరంగ మలవిసర్జన జరగకుండా చూడాలని, ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News November 23, 2025

TODAY HEADLINES

image

* సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము
* డ్రగ్స్-టెర్రర్ లింక్‌‌ను నాశనం చేయాలి: మోదీ
* సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి
* అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ సాకారం కాలేదు: రేవంత్
* కొత్త లేబర్ కోడ్‌లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: CBN
* TG పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల
* బెంగళూరులో ప్రైవేట్ ఈవెంట్‌లో ఒకే వేదికపై జగన్, కేటీఆర్