News January 17, 2025

వరంగల్: శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

పోటీ పరీక్షలు ప్రిపేరయ్యే మైనారిటీ అభ్యర్థులకు బేసిక్ ఫౌండేషన్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేష్ తెలిపారు. రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు HYDలో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు సరైన ధ్రువపత్రాలతో వచ్చే నెల 15 వరకు కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News January 17, 2025

సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని హన్మకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో ప్రభుత్వ పథకాల కోసం నిర్వహిస్తున్న సర్వేను నేడు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News January 17, 2025

వరంగల్: లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలుపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డులకు కోసం 1.57లక్షల దరఖాస్తులు గతంలోనే వచ్చాయి. ఆత్మీయ భరోసాకు 18 లక్షల EGS కార్డులు ఉన్నాయి.రైతు భరోసాలో 8.77 లక్షలు గత సీజన్‌లో లబ్ధి పొందారు. వీటిపై ఈ నెల 20 వరకు దరఖాస్తులను పరిశీలించి, 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు.

News January 17, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు బ్యాలెట్ పేపర్ల ముద్రణపై కసరత్తు చేస్తున్నారు. ఎప్పటి లాగే సర్పంచులకు గులాబీ బ్యాలెట్, వార్డ్ మెంబర్లకు తెలుపు బ్యాలెట్ ఉపయోగించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,806 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.