News August 3, 2024

వరంగల్: శ్రావణ మాసంలో శుభ ముహూర్తాలు ఇవే!

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయని అర్చకులు తెలిపారు. శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలకు ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది వివాహాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

Similar News

News October 1, 2024

WGL: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

వరంగల్: మార్కెట్లో పత్తి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర తటస్తంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7450 పలకగా… నేడు కూడా అదే ధర పలికింది. అలాగే ఈరోజు మార్కెట్ తరలిరాగా రూ. 6910 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గత వారంతో పోలిస్తే ధరలు పడిపోయాయని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.

News October 1, 2024

డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన నల్లబెల్లి వాసులు

image

నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో నల్లబెల్లి మండల వాసులు సత్తాచాటారు. నల్లబెల్లికి చెందిన మూటిక ప్రవళిక స్కూల్ అసిస్టెంట్ సైన్స్ విభాగంలో 2 వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో 7 వ ర్యాంకు కొండ్లె వినయ్, 14వ ర్యాంకు రాయరాకుల రాజేష్, 54వ ర్యాంకు కొండ్లె నాగలక్ష్మి, నారక్క పేట నుండి 70వ ర్యాంక్ వైనాల రవి, 73వ ర్యాంకు అనుముల శ్రీలత డీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు. వీరిని బంధువులు అభినందించారు.