News November 18, 2025

వరంగల్: సాదాబైనామాల సంగతేందీ..?

image

సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూములపై హక్కుల కోసం రైతులకు ఏళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. భూ భారతిలో వీలు కల్పించారని నేతలు చెబుతుంటే, అధికారులు మాత్రం కాసులు వచ్చే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వివాదాస్పదమైన వాటిని మాత్రం ముట్టుకోకుండానే రిజెక్టు చేస్తున్నారు. WGLలో 53996, HNK 18507, MLG 34441, JNG 30వేలు, MBD 24014, BHPL 18739 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,79,697 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News November 18, 2025

మంచిర్యాలలో అమానవీయ ఘటన

image

మంచిర్యాలలో అమానవీయ ఘటన జరిగింది. సాయి హనుమాన్ నగర్‌కు చెందిన వృద్ధురాలు నాడెం రాజు ఆదివారం రాత్రి మృతి చెందింది. కుమార్తె లలిత పాత ఇంటిలో వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహాన్ని పాత మంచిర్యాలలోని ఇంటికి తరలించింది. ఈ విషయం సీఐ ప్రమోద్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన జోక్యంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చారు. తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పంచుకునేందుకు అంగీకారం కుదరడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

కడుపులోనే కవలలు, భార్య మృతి.. భర్త ఆత్మహత్య

image

AP: అన్నమయ్య జిల్లాకు చెందిన విజయ్‌-శ్రావ్య దంపతుల కథ విషాదాంతమైంది. 8 ఏళ్ల క్రితం పెళ్లి కాగా HYDలో అద్దెకు ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో IVF ద్వారా శ్రావ్య గర్భం దాల్చింది. 8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్య కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా గర్భంలోని కవలలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా చనిపోయింది. ఈ విషాదాన్ని తట్టుకోలేని విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.