News November 22, 2025
వరంగల్: ‘సారథి’ సాగట్లే..!

సారథి పరివాహన్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు పెరుగుతుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, స్థాయి పెంపుదల, బ్యాడ్జ్ లైసెన్స్ అప్లికేషన్‌లకు డేటా కనిపించకపోవడం, రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడం వంటి సమస్యలు వరుసగా వస్తున్నాయి. రెండు నెలలుగా వెబ్‌సైట్ నూతనీకరణ తర్వాత పరిస్థితి ఇంకా చక్కదిద్దకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు
Similar News
News November 22, 2025
భద్రాద్రి: ‘హిడ్మాను పట్టుకొని చంపేశారు’

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజేలను పోలీసులు ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారని, ఆ తర్వాతే ఎన్‌కౌంటర్ పేరిట కట్టుకథలు చెబుతున్నారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదలైంది. హిడ్మా హత్యను నిరసిస్తూ, ఈ నెల 23న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. నవంబరు 20న రాసిన ఈ లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
News November 22, 2025
HYD: బీసీ కమిషన్ రిపోర్ట్‌కు కేబినెట్ ఆమోదం

తెలంగాణలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీ రాజ్ శాఖ నేడు జీవోను విడుదల చేయనుంది. జిల్లా కలెక్టర్లు నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. పూర్తి నివేదికను పంచాయతీ రాజ్ శాఖ నవంబర్ 24వ తేదీన కోర్టుకు సమర్పించనుంది. ఈ నిర్ణయం ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నారు.
News November 22, 2025
విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం: మావోయిస్ట్ పార్టీ

డిసెంబర్ 2 నుంచి 8 వరకు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (PLGA) 25వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని CPI(మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ పిలుపునిచ్చింది. కగార్ యుద్ధం నుంచి పార్టీని, PLGAని, ప్రజా సంఘాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దామని పేర్కొంది. 11 నెలల్లో 320 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని తెలిపింది.


