News January 3, 2025

వరంగల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి జిల్లా మంత్రులు

image

సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు. సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటిస్తూ జీవో జారీ చేసినందుకు సీఎంను మంత్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News January 6, 2025

హనుమకొండ: నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

నేడు (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు.

News January 5, 2025

ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్ సత్యశారద దేవి

image

వరంగల్ జిల్లా మోగిలిచెర్ల లో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మల్లుకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో మంత్రి చర్చించారు.

News January 5, 2025

HNK: మహిళలకు ప్రకృతితో ఒక అవినాభావ సంబంధం ఉంది: ఎంపీ కావ్య

image

ముగ్గులు వేయడం ఒక కళ, ఇలాంటి కళ వలన మన సంస్కృతి, సాంప్రదాయాలు గౌరవించబడుతాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. మహిళలకు ప్రకృతితో ఒక అవినాభావ సంబంధం ఉందని, మహిళల జీవన విధానంలో ముగ్గులు ఒక భాగమని అన్నారు.