News March 16, 2025

వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్‌ను కరీంనగర్ వరంగల్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. గౌస్ ఆలం ఇటీవల కరీంనగర్ నూతన సీపీ బాధ్యతలు చేపట్టారు.

Similar News

News March 16, 2025

బోధన్: షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన రాష్ట్ర మంత్రి

image

బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైతులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మహారాష్ట్రలోని సాంగ్లీ తాలూకాలో చెరుకు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సాంగ్లీలోని శ్రీదత్త షుగర్ ఫ్యాక్టరీ ఛైర్మన్ శ్రీగణపతి రావు పాటిల్, నాయకులు పాల్గొన్నారు.  

News March 16, 2025

బంగారం ధర తగ్గే అవకాశం ఉందా?

image

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరలు తగ్గుతాయనే విషయమై నిపుణులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ అనూహ్య నిర్ణయాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే తగ్గకపోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం 3వేల డాలర్లు ఉన్న ఔన్సు ధర 3,040 డాలర్లకు చేరాక అక్కడి నుంచి తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై 1-2 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

News March 16, 2025

రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో CITD పరీక్షలు

image

రామంతపూర్లోని జవహర్ లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్(CITD) సంబంధించి DECE బ్యాచ్ 1&2 పరీక్షలు 4 రోజుల పాటు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 26, 27, 28, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులందరూ పరీక్షలకు సిద్ధం కావాలని CITD అధికారులు సూచించారు.

error: Content is protected !!