News September 12, 2025

వరంగల్: సులభ పాస్‌వర్డ్‌లకు గుడ్‌బై చెప్పండి…!

image

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సులభంగా గుర్తుంచుకునే పాస్‌వర్డ్‌లు వాడకూడదని వరంగల్ పోలీసులు సూచిస్తున్నారు. 12345, ABCDEF వంటి సాధారణ పాస్‌వర్డ్‌లు లేదా స్వంత మొబైల్ నంబర్, పుట్టిన రోజు వంటి వ్యక్తిగత వివరాలను పాస్‌వర్డ్‌గా ఉంచడం హ్యాకర్లకు తేలికైన లక్ష్యమని హెచ్చరించారు. ఎవరూ ఊహించలేని బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించడం ద్వారా మాత్రమే వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ లావాదేవీలు కాపాడుకోవచ్చన్నారు.

Similar News

News March 30, 2026

వాహనాల వేలం ద్వారా రూ.10.06 లక్షల ఆదాయం: ఆర్టీఓ

image

జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పన్ను బకాయిలు, ఫిట్‌నెస్ లేని 36 వాహనాలకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.10,06,600 ఆదాయం సమకూరినట్లు జిల్లా రవాణా అధికారి (ఆర్టీఓ) ఆర్.సురేశ్ తెలిపారు. పారదర్శకంగా జరిగిన ఈ వేలంలో వివిధ కేటగిరీల వాహనాలను వేలం వేశామన్నారు. యజమానులు సకాలంలో పన్నులు చెల్లించి పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 30, 2026

NRPT: ‘మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి’

image

జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులకు సూచించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో యాంటీ నార్కోటిక్స్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిఘా పెట్టాలని చెప్పారు. డ్రగ్స్ నివారణకు పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఆర్డీవో రామచందర్, అధికారులు పాల్గొన్నారు.

News March 30, 2026

పశ్చిమాసియా యుద్ధంపై TG అసెంబ్లీ తీర్మానం

image

TG: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్, US యుద్ధం ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. Dy CM భట్టి విక్రమార్క ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘ఇప్పటికే 4వేలమంది అమాయకులు మరణించారు. ఆర్థిక విధ్వంసం ప్రపంచ వ్యాప్తమై ప్రమాదకరంగా పరిణమించింది. ఇది 3వ ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదముంది. యుద్ధం ఆగేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని కోరింది.