News April 2, 2025

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

image

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM సరిపోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News April 3, 2025

వర్ధన్నపేట: కనిపిస్తే ఫోన్ చేయండి

image

బుధవారం వర్ధన్నపేటలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సినీ ఫక్కీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. నందనం భారతమ్మ అనే వృద్ధురాలిని నమ్మించి ఓ వ్యక్తి రూ.3లక్షలు దోచుకెళ్లాడు. కాగా, నిందితుడి ఫోటోను వర్ధన్నపేట పోలీసులు విడుదల చేశారు. అతడి వివరాలు తెలిపితే రూ.10వేల నగదు ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు.

News April 3, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

News April 3, 2025

వరంగల్: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

image

హనుమకొండ పోస్టల్ కాలనీలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సుబేదారి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేస్తున్నారని పోలీసుల తెలిపారు. ఇందులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్, రూ.2,450 నగదు స్వాధీనపరచుకున్నామని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

error: Content is protected !!