News April 2, 2025
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM రోగులకు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News November 10, 2025
తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శిగా ఆదిలాబాద్ వాసికి చోటు

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శిగా ఆదిలాబాద్ మాజీ కౌన్సిలర్, బీజేపీ ఫ్లోర్ లిడర్ బండారి సతీష్‌కు చోటు లభించింది. రాష్ట్ర కార్యవర్గం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం, సంక్షేమం కోసం కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు డా.చీమ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకాల రామచందర్ బండారి సతీష్‌ను ఆదేశించారు.
News November 10, 2025
MBNR: ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి స్వయంగా ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. ఆమె వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పర్యవేక్షిస్తామని ఎస్పీ తెలిపారు.
News November 10, 2025
ఆదిలాబాద్: పత్తి, సోయా కొనుగోలు పరిమితిని పెంచాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తి, సోయా కొనుగోళ్ల పరిమితిని పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల్ శంకర్ కోరారు. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్‌కు వినతిపత్రం అందజేశారు. సోయా ఎకరాకు 6 నుంచి 7.60 క్వింటాళ్లు, సీసీఐ ద్వారా పత్తిని ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేయాలని కోరారు.


