News November 19, 2025

వరంగల్: సూరీడూ.. జల్దీ రావయ్యా..!

image

ఉమ్మడి వరంగల్‌లో చలి పెరిగిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లలోని విద్యార్థులు చలికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు హాస్టళ్లు ఊరి చివర్లో ఉండటంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో ఉదయమే ఎండ కోసం తపిస్తున్నారు. సూర్యుడు రాగానే విద్యార్థులంతా బయటకు వచ్చి ఎండలో నిలబడుతున్నారు. దీంతో ఎండతో పాటు విటమిన్-డి సైతం లభిస్తుంది. పర్వతగిరిలోని KGBV హాస్టల్ విద్యార్థులు ఉదయం వేళలో ఇలా ఎండలో నిలబడుతున్నారు.

Similar News

News November 22, 2025

GWL: పెండింగ్‌ భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

image

పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి భవనంలో మండలాల వారీగా మీసేవ దరఖాస్తులు, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్, ఎఫ్‌-లైన్ పిటిషన్లపై సమీక్షించారు. ఆరు నెలలు దాటిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని ఆయన సూచించారు.

News November 22, 2025

గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు: కలెక్టర్

image

యువత భవిష్యత్తును అంధకారం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పాఠశాల, కళాశాలలో పోస్టర్లు, సమావేశాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.