News November 22, 2025
వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం ఎప్పుడు..?

నిజాం కాలం నాటి WGL సెంట్రల్ జైలు 2021లో కూల్చగా, మామునూరులో కొత్త జైలు నిర్మిస్తామని ప్రకటించినా నాలుగున్నరేళ్లుగా పనులు మొదలుకాలేదు. వెయ్యి మంది ఖైదీలను ఇతర జైళ్లకు మార్చడంతో వారి కుటుంబాలు కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు.101 ఎకరాలు కేటాయించినా బడ్జెట్ లేక పనులు నిలిచాయి. ప్రస్తుతం మామునూరులో 20 మంది ఖైదీలకు 40 మంది సిబ్బంది పని చేస్తుండగా, కొత్త జైలు నిర్మాణంపై ప్రభుత్వం స్పందించడం లేదు.
Similar News
News November 23, 2025
రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: ఐబొమ్మ రవి తండ్రి

<<18323509>>ఎన్‌కౌంటర్<<>> చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పు బట్టారు. ‘ఆయనను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా’ అని చెప్పారు.
News November 23, 2025
పుత్తూరు: హత్య చేసిన నిందితుడి అరెస్ట్

పుత్తూరు మండలం గొల్లపల్లి వద్ద ఈనెల 19వ తేదీన హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు తాలూకా కేశవరాజుకుప్పానికి చెందిన రవి(40)ని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వ్యసనాలకు బానిసైనా రవి రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు పరిసర ప్రాంతాలలో చెత్త, కాగితాలు ఏరుతూ ఉండేవాడు. తినడానికి డబ్బు ఇవ్వలేదని తన సంచిలోని కత్తి తీసి రామ్మూర్తిని పొడిచాడు.
News November 23, 2025
సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.


