News March 29, 2025
వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.
Similar News
News November 8, 2025
కృష్ణా: LLB & BA.LLB కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB & BA.LLB కోర్సులకు 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రతీ సెమిస్టర్‌లో 90- 92 పని దినాలు, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్‌ను రూపొందించామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.
News November 8, 2025
నెల్లూరు: అధికారులకు షోకాజ్ నోటీసుల జారీ

నెల్లూరు జిల్లాలో విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు పంచాయతీ కార్యదర్శులు, నిధులు దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు DPO శ్రీధర్ తెలిపారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో హౌస్ టాక్స్ మెటీరియల్ గురించి తప్పుగా నమోదు చేసిన ఉదయగిరి, పెద్దపవని, ఏఎస్ పేట, తాటిపర్తి PSలకు నోటీసులు అందజేశారు. ఎనమాదాల సర్పంచ్ సుందరయ్య ఆరో ప్లాంట్ నిధులు దుర్వినియోగంపై నోటీసులు అందజేశారు.
News November 8, 2025
ASF: 571 కేసులు.. 38 మంది అరెస్ట్.. 40 వాహనాలు సీజ్

ఆసిఫాబాద్ జిల్లాలో గుడుంబా, దేశీదారు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 571 గుడుంబా కేసులను నమోదు చేసి, 38 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇందులో 40 వాహనాలను కూడా సీజ్ చేశారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, ప్రభావిత గ్రామాల్లో నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.


