News March 29, 2025

వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.

Similar News

News February 10, 2026

రేపే మున్సిపల్ ఎన్నికలు.. ఓటుకు రూ.10వేలు!

image

TG: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఈ ఒక్కరాత్రే మిగిలి ఉండటంతో పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. నోట్లతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. కరీంనగర్ జమ్మికుంట మున్సిపాలిటీలో కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇంటికి 25కిలోల రైస్ బ్యాగ్ అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు మహిళా ఓటర్లే లక్ష్యంగా రూ.5వేలు, వెండి కుంకుమ భరిణె, చీరలు బహుమతులుగా అందిస్తున్నట్లు సమాచారం.

News February 10, 2026

అనకాపల్లి: ‘వీధి కుక్కల సంతతి పెరగకుండా చూడాలి’

image

జిల్లాలో వీధి కుక్కల సంతతి పెరగకుండా చూడాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అనకాపల్లి యానిమల్ బర్త్ సెంటర్‌లో కుక్కలకు చేస్తున్న స్టెరిలైజేషన్ ప్రక్రియను ఆమె మంగళవారం పరిశీలించారు. కుక్కలను పట్టుకోవడం, స్టెర్లైజేషన్, వాటికి అందిస్తున్న ఆహారం, తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చక్రవర్తి పాల్గొన్నారు.

News February 10, 2026

వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్: ఎంపీ

image

2026–27 కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ దిశగా ముందడుగు అని ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై ధన్యవాద తీర్మానంలో మాట్లాడిన ఆయన.. ఆర్థిక క్రమశిక్షణతో దూరదృష్టి కలిగిన బడ్జెట్‌ను సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. బడ్జెట్‌లో మేక్ ఇన్ ఇండియా, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక వృద్ధి వేగవంతం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.