News September 20, 2025
వరంగల్: సోషల్ మీడియాలో మీ అడ్రస్ పెట్టొద్దు!

సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత అడ్రస్ పెట్టొద్దని, మీ వ్యక్తిగత సమాచారం చాలా కీలకమని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలకు సూచించారు. సోషల్ మీడియా ప్రొఫైల్‌లో వివరాలు ఇచ్చేముందు జాగ్రత్త వహించాలని, మీరు ఇచ్చే వివరాలే సైబర్ మోసాలకు దారితీస్తాయన్నారు. సోషల్ మీడియాలో ప్రొఫైల్‌కు లాక్ ఉపయోగించాలని, అపరిచితుల నుంచి వచ్చే రిక్వెస్టులతో అప్రమత్తం ఉండాలని సూచించారు.
Similar News
News September 20, 2025
నేడు మాచర్లకు సీఎం చంద్రబాబు

AP: నేడు CM చంద్రబాబు పల్నాడు(D) మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.10.30 గం.కు మాచర్లకు చేరుకుని స్థానిక చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టనున్నారు. హెల్త్ క్యాంపులో సఫాయి కర్మచారీలతో మాట్లాడనున్నారు. మున్సిపాల్టీలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు రూ.2 కోట్ల చెక్కు అందించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు, పాఠశాలల ప్రతినిధులను సన్మానించనున్నారు.
News September 20, 2025
సిద్దిపేట: 21న చింతమడకకు కవిత రాక

మాజీ సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడకకు ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వస్తున్నారని జాగృతి ప్రతినిధులు తెలిపారు. కాగా ఇటీవల పలువురు గ్రామస్థులు కవితని కలిసి గ్రామంలో జరిగే బతుకమ్మ వేడుకలు రావాలని కోరారు. స్పందించిన కవిత ఉత్సవాలకు హాజరవుతారని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం వస్తున్నారని తెలిపారు.
News September 20, 2025
కృష్ణా జిల్లా అండర్-19 హాకీ జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 23న మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో అండర్-19 హాకీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత్ తెలిపారు.