News July 12, 2024
వరంగల్: స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని కలెక్టరేట్ ఎదుటధర్నా

వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని SFI నాయకులు శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. అనంతరం SFI నాయకులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా AEO కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి యారా ప్రశాంత్, అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మరియు నాయకులు పాల్గొన్నారు.
Similar News
News February 2, 2026
వరంగల్: ఎంపిక ప్రక్రియపై దిశానిర్దేశం

మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.సత్య శారదతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News February 2, 2026
బలమైన ప్రజాపక్షపాలన అందించేందుకు సిద్ధం: బీజేపీ

BJP ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగింది. గంట రవికుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి, పారదర్శకత, బాధ్యతాయుత పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే బీజేపీ లక్ష్యమన్నారు. మున్సిపాలిటీల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థలలో కూడా బలమైన ప్రజాపక్ష పాలన అందించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు.
News February 2, 2026
వారసత్వ కట్టడాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలి: ఎంపీ డా.కావ్య

వరంగల్లోని కాకతీయుల కాలంనాటి చారిత్రక కట్టడాల సంరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు చేపట్టాలని ఎంపీ డా. కడియం కావ్య డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభలో సంస్కృతి శాఖ మంత్రిని వరంగల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలను నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ కింద చేపట్టిన అభివృద్ధిపై ఎంపీ వివరణ కోరారు. అందుకు ఆ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారని ఎంపీ తెలిపారు.


