News March 30, 2026

వరంగల్: స్కూల్స్‌లో అత్యవసర ఫోన్ నంబర్ల బోర్డులు!

image

సర్కారు బడుల్లో అత్యవసర ఫోన్ నంబర్ల బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.12.66 లక్షలు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలోని 2,533 పాఠశాలలకు ఓక్కో స్కూల్‌కు రూ.500 కేటాయించింది. ఈ బోర్డులో హాస్పిటల్, పోలీసు, ఫైర్, MEO, DEO, కలెక్టర్, HM నంబర్లు ఉంటాయి. HNKలో 333 పాఠశాలలకు రూ.1,66,500, WGL-404కు రూ.2,02,000, ములుగు-375కు రూ.187500, MHBD-739కు రూ.369500, జనగామ-345JI రూ.172500, BHPL-337కు రూ.168500 మంజూరయ్యాయి.

Similar News

News March 30, 2026

చిత్తూరులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 1100కు కాల్ చేయడంతో పాటు Meekosam.ap.gov.inకు మెయిల్ చేసి కూడా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావచ్చని సూచించారు.

News March 30, 2026

HYD: బియ్యం ఇస్తారు సరే.. ఎక్కడ స్టోర్ చేయాలి?

image

ఎండలు, వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చేనెలలో 3నెలలకు సరిపడా లబ్ధిదారులకు సర్కారు బియ్యం పంపిణి చేయనుంది. అయితే ఇపుడు రేషన్ డీలర్లు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేషన్ షాపులు నగరంలో ఇప్పుు చిన్న చిన్న మడిగెల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు క్వింటాళ్ల కొద్దీ బియ్యం స్టోర్ చేసుకోవాల్సి ఉండటంతో వాటిని ఎక్కడ నిల్వ ఉంచాలనేది తలనొప్పిగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.

News March 30, 2026

బాసర: గోదావరి పుష్కరాలపై సీఎం సమీక్ష

image

2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఘాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసి, 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, సమన్వయం కోసం ప్రత్యేక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.