News October 4, 2025

వరంగల్: స్థానిక ఎన్నికల నిర్వహణకు కంట్రోల్ రూమ్

image

వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని కలెక్టర్ అన్నారు. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతం చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.

Similar News

News October 3, 2025

రాయపర్తి: సన్నూరు మాజీ సర్పంచ్ కన్నుమూత

image

రాయపర్తి (M) ఉమ్మడి సన్నూరు గ్రామానికి సుదీర్ఘకాలం పాటు(13ఏళ్లు) సర్పంచిగా సేవలందించిన కుందూరు భీష్మారెడ్డి (74) శుక్రవారం సాయంత్రం తన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. వెంకటేశ్వరపల్లి, జయరాంతండా(S),బాలు నాయక్ తండాలతో కూడిన సన్నూరు ఉమ్మడి గ్రామానికి 1990-2003 వరకు రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా, 3 ఏళ్లపాటు గ్రామ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై పరిపాలన సాగించారు.

News October 3, 2025

నర్సంపేట ఘటనపై విచారణకై ఆర్డిఓకు కలెక్టర్ ఆదేశం

image

నర్సంపేట ‘గాంధీ జయంతి వేళ CI సమక్షంలో జంతు బలి.. విమర్శలు’ పేరిట వచ్చిన కథనంపై వరంగల్ కలెక్టర్ సత్య శారద స్పందించారు. స్థానిక నర్సంపేట ఆర్డిఓతో ప్రాథమిక విచారణ జరిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. దీంతో పాటుగా నర్సంపేట సీఐపై చర్యల కోసం వరంగల్ ఈస్ట్ జోన్ డీసీసీపీకి సిఫార్సు చేశారు.

News October 2, 2025

వరంగల్: శ్రీ రాజరాజేశ్వరీ అవతారంలో అమ్మవారి దర్శనం

image

వరంగల్ ఎంజీఎం సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం విజయ దశమి పురస్కరించుకుని సాయంత్రం అమ్మవారు వెండి చీరెలో దర్శనమిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.