News February 25, 2025

వరంగల్: స్పెషల్ బస్సుల టికెట్ ఛార్జీలు ఇలా..!

image

మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా బస్టాండ్ల నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ నుంచి ఐనవోలుకు రూ.50, మెట్టుగుట్టకు రూ.50, హనుమకొండ నుంచి వేములవాడకు రూ.210, కాళేశ్వరానికి రూ.250, రామప్పకు రూ.140, పాలకుర్తికి రూ.90, తొర్రూరు నుంచి పాలకుర్తికి రూ.100, మహబూబాబాద్ నుంచి కురవికి రూ.30, జనగామ నుంచి కొమురవెల్లికి రూ.100 టికెట్ ధరలను తీసుకోనున్నారు.

Similar News

News February 27, 2026

మార్నింగ్ అతిగా స్ట్రెచ్ చేస్తున్నారా? జాగ్రత్త..!

image

బాడీ ఫిట్‌గా ఉండాలని చాలామంది విపరీతంగా స్ట్రెచింగ్ చేస్తుంటారు. అది కండరాలకి మంచి కంటే కీడే ఎక్కువ చేస్తుందట. అలా మొండిగా లాగడం వల్ల మజిల్స్ చిట్లిపోవడమే కాకుండా, కీళ్లలో బలం తగ్గుతుంది. వర్కవుట్ మొదలెట్టక ముందే అతిగా స్ట్రెచ్ చేస్తే మీ శక్తిని తగ్గిస్తుందని రీసెర్చ్ చెప్తోంది. నరాలు దెబ్బతినే ఛాన్స్ కూడా ఉంది. అందుకే వార్మప్ అయ్యాకే స్ట్రెచ్ చేయండి. ఏదైనా 15-30 సెకన్లు మాత్రమే హోల్డ్ చేయండి.

News February 27, 2026

అఫ్గాన్‌పై విరుచుకుపడుతున్న పాక్!

image

పాక్, అఫ్గాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. <<19249664>>అఫ్గాన్ దాడుల<<>>కు ప్రతీకారంగా పాక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆపరేషన్ గజబ్-లిల్-హక్ పేరిట ఏకంగా రాజధాని కాబూల్‌పైనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాందహార్, పక్తియాలోని మిలిటరీ బేస్‌లపైనా పాక్ సేన విరుచుకుపడినట్లు తెలుస్తోంది. అనేక ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు సమాచారం. తాలిబన్ల నెట్‌వర్క్ భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

News February 27, 2026

ఇవాళ పుట్టపర్తి రావొద్దు: కలెక్టర్

image

జిల్లాలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రతీ నెల 4వ శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటన తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే దివ్యాంగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఫిర్యాదులు సమర్పించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని కోరారు.