News January 12, 2026

వరంగల్: స్వాతంత్ర్య సమరయోధురాలు కన్నుమూత

image

వరంగల్ పరిధి గిర్మాజిపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత వన్నాల పెద్ద వీరన్న సతీమణి, స్వాతంత్ర్య సమరయోధురాలు వన్నాల లక్ష్మి ముదిరాజ్ (100) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె దేశం కోసం చేసిన పోరాటం, దేశభక్తి స్ఫూర్తి, సేవా విలువలను కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తు చేస్తున్నారు. అభిమానులు, పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

Similar News

News February 8, 2026

వనపర్తి: మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు!

image

వనపర్తి మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య బలమైన త్రిముఖ పోటీ నెలకొంది. అగ్రనేతల పేర్లతో అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఓట్లు చీలుస్తారో అన్న ఉత్కంఠ సర్వత్ర వ్యక్తమవుతోంది.

News February 8, 2026

ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

image

T20WC: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.

News February 8, 2026

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు 162 మంది గైర్హాజరు: ఆర్ఐవో

image

ఏలూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 3,454 మంది హాజరు కాగా 162 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23 నుంచి జరిగే థియరీ పరీక్షలు సీసీ కెమెరాల నిర్వహణలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని స్పష్టం చేశారు.