News August 15, 2025
వరంగల్: ‘స్వేచ్ఛ’ కోసం రూ.12 వేలు..!

స్వతంత్రోద్యమంలో వరంగల్ జిల్లాకు సైతం ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 1945 ఫిబ్రవరి 5న మహాత్మా గాంధీ వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారీ స్థాయిలో వచ్చిన ప్రజలు ఆనాడు స్వతంత్ర ఉద్యమానికి అక్కడికక్కడే దాదాపు రూ.12 వేలు సమీకరించి ఉద్యమానికి నిధిగా గాంధీజీకి అందించారు. గాంధీజీ రాక గుర్తుగా ఎలాంటి స్మృతులు లేకపోవడం బాధాకరమని స్థానికులు చెబుతారు.
Similar News
News August 15, 2025
NRPT: మారణహోమానికి నేటికి 20 ఏళ్లు

నారాయణపేట పట్టణంలో నక్సలైట్లు జరిపిన మారణహోమానికి నేటికి 20 ఏళ్లు అయ్యాయి. నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఆనాటి ఉమ్మడి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డితోపాటు ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డితోపాటు మరో 9 మంది మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా నక్సలైట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమానికి పాల్పడ్డారు.
News August 15, 2025
అనంతపురంలో వ్యభిచారం.. పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై అనంతపురం పోలీసులు దాడి చేసి, నిర్వాహకులు, విటులను గురువారం అరెస్టు చేశారు. నగరంలోని వెంకటస్వామి వీధిలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణ పోలీసులు గురువారం దాడి చేశారు. నిర్వాహకురాలు పుల్లమ్మ, విటులు వెంకటపతి, నాగరాజు, పెద్దిరెడ్డిని అరెస్టు చేశారు. నలుగురు యువతులను కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చారు.
News August 15, 2025
ఉప్పు అనుకుని చీమల మందు కలిపారు.. వెలుగులోకి కార్మికుల నిర్వాకం

నర్సీపట్నం జడ్పీ హైస్కూల్ (మెయిన్) మిడ్ డే మీల్స్ కార్మికుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం పిల్లలకు పెట్టే మధ్యాహ్నం భోజనంలో ఉప్పు అనుకుని చీమల ముందు కలిపేశారు. తర్వాత ఆహారం వాసన రావడంతో సిబ్బంది నాలుక కరుచుకున్నారు. వెంటనే భోజనాన్ని బయట పారబోసి తిరిగి విద్యార్థుల కోసం వండారు. విషయం బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది.