News November 17, 2025
వరంగల్, హనుమకొండను కలిపి ఒకే జిల్లా?

WGL, HNKను కలిపి ఒకే జిల్లాగా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు నగరాన్ని ఒకే జిల్లాగా మార్చాలంటూ పదే పదే వేదికల మీద BRSని విమర్శిస్తుండటం తెలిసిందే. ఈ మేరకు గ్రేటర్ WGLను ఒకే జిల్లాగా చేసి, మిగిలిన ప్రాంతాన్ని మరో జిల్లాగా కొనసాగించాలనే నిర్ణయంతో డ్రాఫ్టును జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
Similar News
News November 17, 2025
మెదక్: పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 7.1, సదాశివపేట 7.9, న్యాల్కల్ 8.0, మెదక్ జిల్లా నర్లాపూర్, సర్ధాన, వాడి 9.3, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డి పేట 8.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, ఆస్తమా రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 17, 2025
సూర్యాపేట: భార్యను రోకలిబండతో బాది హత్య

మోతే మండలంలోని సిరికొండ గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కారింగుల వెంకన్న అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య పద్మ(40)ను రోకలి బండతో బాది హత్య చేశాడు. ఆవేశానికి లోనైన వెంకన్న బలంగా తలపై కొట్టడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న మోతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News November 17, 2025
JGTL: ‘జూబ్లీ’ గెలుపు.. పార్టీ పరంగా BCలకు 42%..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుతో అధికార పార్టీలో ఫుల్ జోష్ పెరిగింది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 24న ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలపాలని హై కోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నిర్వహణ సర్కార్‌కు అనివార్యంగా మారింది. అయితే, పాత రిజర్వేషన్ల ప్రకారమే వెళ్లి, పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి.


