News April 5, 2025
వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పడిపోతున్న భూగర్భ జలాలు

వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం, యాసంగి పనులు మొదలు పెట్టడంతో నీటి వినియోగం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. HNK జిల్లాలో ఫిబ్రవరిలో 6.30 మీటర్ల లోతుకు నీరు పడిపోగా.. మార్చి చివరి నాటికి 7.16 మీటర్ల లోతుకు పడిపోయింది. WGL జిల్లాలో డిసెంబర్‌లో 4.18కు పడిపోగా.. మార్చి చివరి నాటికి 6.32 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
Similar News
News April 5, 2025
సంక్షేమ హాస్టల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

AP: NTR జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్ల పర్యటనలో భాగంగా బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని CM చంద్రబాబు సందర్శించారు. పాఠశాల మొత్తం కలియతిరిగిన ఆయన వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను పరిశీలించారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, సరకుల నాణ్యతను తనిఖీ చేశారు. భోజనం రుచిగా, నాణ్యతతో అందిస్తున్నారా? అని విద్యార్థులను ఆరా తీశారు. మెనూ ప్రకారం ఫుడ్ అందిస్తున్నారా? లేదా? అని తెలుసుకున్నారు.
News April 5, 2025
ప్రధాని మోదీ నకిలీ ఓటర్ కార్డును రూపొందించిన ChatGPT

సైబర్ నేరగాళ్ల చేతిలో ChatGPT దుర్వినియోగానికి గురవుతోంది. దీనితో ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను సైతం నకిలీ చేస్తున్నారు. రియలిస్టిక్ ఆధార్ & పాన్ కార్డులు, పాస్‌పోర్ట్, ఓటరు IDలను ఇది రూపొందించింది. అందించిన వివరాలతో ChatGPT చేసిన కార్డులు నకిలీవని గుర్తించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్ కార్డును కూడా ఇది నకిలీ చేసింది.
News April 5, 2025
‘మహాకాళి’ సినిమాలో బాలీవుడ్ నటుడు?

‘ఛావా’ సినిమాలో విలనిజంతో ఆకట్టుకున్న అక్షయ్ ఖన్నా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU)లో రానున్న ‘మహాకాళి’ సినిమాలో ఆయన నటించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో అక్షయ్ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిపాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ‘ఛావా’లో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.