News January 24, 2026

వరంగల్, హన్మకొండ జిల్లాల కలయికకు బ్రేక్ పడినట్లేనా?

image

WGL, HNK జిల్లాలు కలుస్తాయని ఆశించిన వారి కలలు కల్లలయ్యాయి. కలిసి ఉన్న WGL, HNK పట్టణాలు.. జిల్లాలుగా మాత్రం వేరుగా ఉన్నాయి. ఈ రెండు నగరాలను అంటే వరంగల్, హన్మకొండ జిల్లాలను ఒకే జిల్లా చేయాలనే డిమాండ్ ఉంది. ఈ మేరకు ప్రభుత్వ సైతం తాజాగా అడుగులు వేసినట్లే కనిపిచింది. దీంతో రెండు జిల్లాలు ఒక్కటవుతాయనే ఆశలో ప్రజలు ఉన్నారు. అయితే, తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరణతో బ్రేక్ పడినట్లయింది.

Similar News

News February 6, 2026

క్యూఆర్ కోడ్‌తో భూవివరాలు సులభతరం: కలెక్టర్

image

పట్టాదారు పాసుపుస్తకాల్లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూమి, యజమాని వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కుర్నూతల గ్రామం వెంకట్ రాజు గారి పల్లెలో నిర్వహించిన పాసుపుస్తకాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, పుస్తకాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు.

News February 6, 2026

421 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 421 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/

News February 6, 2026

KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు: రేవంత్

image

TG: రూ.లక్ష కోట్లతో కట్టిన ‘కాళేశ్వరం’ మూడేళ్లలో కూలిపోయిందని CM రేవంత్ విమర్శించారు. గోదావరి జలాల పేరుతో కల్వకుంట్ల కుటుంబం TGని దోచుకుందని ఆరోపించారు. BJPకి అధికారం ఇస్తే KCRను జైల్లో వేస్తామన్న కిషన్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. జైల్లో KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు? అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎక్కువ నిధులు వస్తాయని NZB సభలో తెలిపారు.