News February 28, 2026
వరంగల్: హెల్మెట్ తలకు భారమా?

వరంగల్ నగరంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్యాషన్ కోసం ప్రాణాలను పణంగా పెడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. హెల్మెట్ లేని ప్రయాణం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నా మార్పు రావట్లేదు. అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టకుండా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News March 3, 2026
ఉస్తాద్ భగత్‌సింగ్ పేరు అందుకే మార్చాం: హరీశ్ శంకర్

ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టైటిల్‌ను తొలుత ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనుకున్నట్లు డైరెక్టర్ హరీశ్ శంకర్ వెల్లడించారు. కానీ, ఆ పేరు SMలో లీకై ‘భవదీయుడు’ అంటే అర్థం ఏంటని GenZల నుంచి సందేహాలు వచ్చాయన్నారు. పేరు అర్థం కాకపోతే ఎలా అని ఆలోచించి ఉస్తాద్ భగత్‌సింగ్ ఖరారు చేసినట్లు చెప్పారు. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశామనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. అలాగే ఈ సినిమా రీమేక్ కాదని మరోసారి స్పష్టం చేశారు.
News March 3, 2026
HYD: మహిళా దారుణ హత్య

వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎల్లకొండ సమీపంలో మహిళా దారుణ హత్యకు గురైంది. ఎత్తిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బాలమణిని(45) గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై పుండ్లిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 3, 2026
చంద్రగ్రహణం.. భద్రాచలం రామాలయం మూసివేత

చంద్రగ్రహణం నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలోని ఆలయ తలుపులను ఈరోజు అర్చకులు, అధికారులు మూసివేయనున్నారు. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు ఆలయం తలుపులు మూసివేసి, రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తదనంతరం మళ్లీ రాత్రి 8 గంటలకు భక్తులకు శ్రీ స్వామివారి దర్శనాలు పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.


