News September 11, 2025

వరంగల్: హోంగార్డుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి: అదనపు డీసీపీ

image

హోంగార్డుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అదనపు డీసీపీ సురేశ్ కుమార్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డుల సమస్యలపై అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ నాగయ్యతో కలిసి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News September 11, 2025

KCR పరిపాలన కోల్పోవడం దురదృష్టం: సబితారెడ్డి

image

KCR పరిపాలన కోల్పోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని MLA సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం షాబాద్‌లో మాజీ ZPTC అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా విజయం BRS దే అని ధీమా వ్యక్తం చేశారు. RSప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, కౌశిక్‌రెడ్డి, రాజేందర్ గౌడ్, ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, నరేందర్ ఉన్నారు.

News September 11, 2025

నానో యూరియా వాడకమే లాభదాయకం: పెద్దపల్లి వ్యవసాయ శాఖ

image

ఈ వానాకాలంలో గతేడాదితో పోలిస్తే అదనంగా 1,551 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగమైంది. ఇకపై వరి 2, 3వ దఫాలకు నానో యూరియానే వాడాలని పెద్దపల్లి వ్యవసాయ శాఖ రైతులకు సూచించింది. యూరియా బస్తాలు ఎక్కువ వృథా అవుతాయని, నానో యూరియా మాత్రం మెల్లగా పోషకాలు అందించి ఎకరాకు 5-7 బస్తాల అదనపు దిగుబడులు ఇస్తుందని పేర్కొంది. ఒక్క బాటిల్ ధర రూ.150 మాత్రమేనని, రైతులు అపోహలు విడిచి వినియోగించాలని విజ్ఞప్తి చేసింది.