News May 7, 2024
వరంగల్: 18-39 ఏళ్ల వారే కీలకం!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లో యువ ఓటర్లు కీలకం కానున్నారు. మహబూబాబాద్, వరంగల్ లోక్సభ పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,22,871 మంది 18-39 ఏళ్ల వారే. మొత్తం ఓటర్లలో వీరి శాతం 48.34. కాగా మహబూబాబాద్ పరిధిలో 50.33%, వరంగల్లో 46.67% మంది ఆ వయస్సు ఉన్న ఓటర్లు ఉన్నారు. దీంతో యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీ అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
Similar News
News January 17, 2025
వరంగల్: లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలుపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డులకు కోసం 1.57లక్షల దరఖాస్తులు గతంలోనే వచ్చాయి. ఆత్మీయ భరోసాకు 18 లక్షల EGS కార్డులు ఉన్నాయి.రైతు భరోసాలో 8.77 లక్షలు గత సీజన్లో లబ్ధి పొందారు. వీటిపై ఈ నెల 20 వరకు దరఖాస్తులను పరిశీలించి, 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు.
News January 17, 2025
వరంగల్: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు!
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు బ్యాలెట్ పేపర్ల ముద్రణపై కసరత్తు చేస్తున్నారు. ఎప్పటి లాగే సర్పంచులకు గులాబీ బ్యాలెట్, వార్డ్ మెంబర్లకు తెలుపు బ్యాలెట్ ఉపయోగించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,806 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
News January 17, 2025
వరంగల్: శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పోటీ పరీక్షలు ప్రిపేరయ్యే మైనారిటీ అభ్యర్థులకు బేసిక్ ఫౌండేషన్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేష్ తెలిపారు. రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు HYDలో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు సరైన ధ్రువపత్రాలతో వచ్చే నెల 15 వరకు కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.