News October 6, 2025
వరంగల్: 20 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 20 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 19 మందితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒక పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. వీరందరికీ కోర్టు జరిమానా విధించిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 6, 2025
కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించిన నేపథ్యంలో, పార్కులో అత్యాధునిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పార్క్ నిర్మాణ పురోగతిపై సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
News October 6, 2025
ఇది మన రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

CJI BR గవాయ్‌పై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘సుప్రీంకోర్టులోనే CJIపై దాడి చేయడాన్ని ఖండించేందుకు మాటలు చాలడం లేదు. ఇది ఆయనపైనే కాదు.. మన రాజ్యాంగంపై దాడి. దేశమంతా ఐక్యమై ఆయనకు అండగా నిలబడాలి’ అని ప్రకటన విడుదల చేశారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని, దేశంలో ఇలాంటి విద్వేషానికి చోటులేదని LoP రాహుల్ గాంధీ అన్నారు.
News October 6, 2025
ఎన్నికలకు పూర్తిగా సంసిద్ధమై ఉండాలి: ADB SP

రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణ నిర్వహించడానికి ముందస్తు చర్యలో భాగంగా ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విధులు నిర్వహించాలన్నారు. నిజాయితీతో విధులు నిర్వర్తించి ఎన్నికలను సమష్టి కృషితో పూర్తి చేయాలని సూచించారు.