News July 12, 2024

వరంగల్: 24 హత్యలు, 59 హత్యాయత్నం కేసులు

image

వరంగల్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 7 నెలల్లో కమిషనరేట్ పరిధిలో 24 హత్యలు, 59 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాశీబుగ్గ, జులైవాడలో కుటుంబ తగాదాలతో భార్యలను భర్తలు హతమార్చారు. గతనెల 30న అర్థరాత్రి మట్టెవాడలో రోడ్డుపై నిద్రిస్తున్న కూలీని స్థానిక వ్యక్తి హత్య చేశాడు. భూ వివాదంలో బుర్హన్‌పల్లి మాజీ సర్పంచిని దారుణంగా హత్య చేశారు. నిన్న 16చింతల్‌లో దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే.

Similar News

News August 30, 2025

ఐనపల్లిలోని గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

ఖానాపూర్ మండలం ఐనపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను వరంగల్ కలెక్టర్ సత్య శారద శనివారం రాత్రి సందర్శించారు. గురుకులంలోని విద్యార్థులు, సిబ్బంది హాజరు, తదితర రిజిస్టర్లను, భోజనాన్ని, గదులను పరిశీలించారు. అందుతున్న బోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ వారితో కలిసి ఆటలు ఆడుతూ ఉన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో తదితరులున్నారు.

News August 30, 2025

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో విడుదల చేసిన 3,83,736 డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితాపై అభ్యంతరాలు తెలపాలని పార్టీల ప్రతినిధులను కలెక్టర్‌ డా.సత్య శారద కోరారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆమె, జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోపు తెలియజేయాలని కోరారు. ఈ నెల 31 లోపు అభ్యంతరాలు పరిష్కరించి, సెప్టెంబర్‌ 2న తుది జాబితా ప్రచురిస్తామన్నారు.

News August 29, 2025

వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

image

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 29.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ మండలంలో 11.2 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. ఖిల్లా వరంగల్‌లో 5.5మి.మీ, ఖానాపూర్‌లో 1.8, నల్లబెల్లిలో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షపాతం నమోదయింది.