News November 27, 2025

వరంగల్: 30 ఏళ్ల నాటి స్నేహం.. చివరి శ్వాస వరకూ అంతిమ ప్రయాణం!

image

ఐనవోలు-వెంకటాపురం రోడ్డుపై <<18400053>>బుధవారం రాత్రి జరిగిన<<>> ప్రమాదంలో ఉడుతగూడెంకు చెందిన వెంకట్రెడ్డి(65), ఒంటిమామిడిపల్లికి చెందిన మహ్మద్ యాకూబ్ అలియాస్ చిన్న యాకూబ్(65) అక్కడికక్కడే మృతి చెందారు. ముప్పై ఏళ్లుగా విడదీయరాని ఈ స్నేహితులు రాంపూర్‌లో ఐరన్ రేకులు కొనుగోలు చేసుకుని ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మరణంలోనూ స్నేహితులు కలిసి వెళ్లిపోవడంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News

News December 1, 2025

సిద్ధిపేట: విధుల్లో నిర్లక్ష్యం.. నలుగురికి షోకాజ్ నోటీసులు

image

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు కలెక్టర్ హైమావతి నోటీసులు ఇచ్చారు. బెజ్జంకి మండల రిటర్నింగ్ అధికారి బాలకిషన్, సహాయ రిటర్నింగ్ అధికారి పరమేశ్వర్‌కు నోటీసులు జారీ చేశారు. వీరికి సరైన రిపోర్ట్ ఇవ్వని మండల పంచాయతీ అధికారులు ఖాజా మొయినొద్దీన్, కలింలకు కూడా నోటీసులు పంపినట్టు తెలిపారు.

News December 1, 2025

WGL: నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 294 మద్యం షాపులకు టెండర్లను పిలవగా, 10,493 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.314.79 కోట్ల ఆదాయం జమ అయ్యింది. కొత్త మద్యం షాపులు రెండేళ్ల పాటు ఉండనున్నాయి. కొత్త షాపులకు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మేడారం జాతర కలిసి వచ్చేలా చేసింది.

News December 1, 2025

అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

image

అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో వాతావరణం మారింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి తదితర మండలాల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా ముసురు వాతావరణం కొనసాగుతుంది. అయితే కొయ్యూరు తదితర మండలాల్లో వరిపంట పండిపోయి కోత దశలో ఉంది. కొన్నిచోట్ల రైతులు పంట కోతలు కోస్తున్నారు. వర్షం పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.