News February 25, 2025
వరంగల్: 75 వేలకు పైగా మిర్చి బస్తాలు రాక

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు వరంగల్ మార్కెట్‌కు సెలవులు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం మార్కెట్‌కి రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే మిర్చి ధరలు భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 25, 2025
EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా

TG: ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే రోజు నుంచి డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్‌ను <
News February 25, 2025
విశాఖలో మూతపడిన మద్యం షాపులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎక్సైజ్ అధికారులు ప్రతి మద్యం దుకాణం వద్దకు చేరుకొని సీల్డ్ వేసి తాళాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో మళ్లీ 27 సాయంత్రం 4 గంటల తర్వాత మద్యం షాపులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు.
News February 25, 2025
మెగా డీఎస్సీ, ‘సుఖీభవ’పై సీఎం కీలక ప్రకటన

AP: మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి, వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగులు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తాం. ఎన్ని ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవను(రైతుకు ₹20K) 3 విడతల్లో అందిస్తాం’ అని వెల్లడించారు.