News October 16, 2025
వరంగల్: 78 పీఎంశ్రీ స్కూళ్లకు నిధులు!

బాలకల సాధికారత, బాలికల కౌమర దశ భద్రతా క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్న ఆయా పీఎంశ్రీ పాఠశాలలకు రూ.15 వేల చొప్పున మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 78 స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి. నిధులు ఎలా వినియోగించుకోవాలో ఆ పాఠశాలల HMలకు సమాచారం అందించారు. ఈ నెల 15 వరకు క్లబ్ ఏర్పాటు నివేదికను సమర్పించాలి. పీటీఎం సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాల్సింటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్టుమెంట్లతో సమన్వయం జరగాల్సి ఉంది.
Similar News
News October 16, 2025
రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు

రబీ మొక్కజొన్నను OCT-15 నుంచి NOV-15 వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక(100-120), మధ్యకాలిక(90-100), స్వల్పకాలిక( 90 రోజుల కంటే తక్కువ) రకాలున్నాయి. రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు D.H.M.111, D.H.M.115, D.H.M.117, D.H.M.121.
☛ హైబ్రిడ్ రకాలు: DHM-103, DHM-105, DHM-107, DHM-109
☛ కాంపోజిట్ రకాలు: అశ్విని, హర్ష, వరుణ్, అంబర్ పాప్‌కార్న్, మాధురి, ప్రియా స్వీట్‌కార్న్
News October 16, 2025
పైడితల్లి అమ్మవారి ఆదాయం రూ.50.13లక్షలు

విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగకు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి కళ్యాణ మండపంలో బుధవారం లెక్కించారు. హుండీలో రూ.50,13,221 నగదు, 35.3గ్రాముల బంగారం, 421గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ శిరీష చెప్పారు. దేవాదాయ శాఖధికారులు, పోలీసులు సమక్షంలో హుండీని లెక్కించారు. లెక్కింపులో అధికారులు, భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు.
News October 16, 2025
భూ రక్షకుడు ఆ వేంకటేశుడే..

వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం.. పూర్వం లోకం అంతమయ్యే సమయంలో సూర్యుడు రుద్రమూర్తి రూపంలో భూమిని మండించాడు. దీంతో చాలా ఏళ్లు వర్షాలు లేక భూమి ఎండిపోయింది. అడవులు, పర్వతాలు బూడిదయ్యాయి. ఆ తర్వాత భయంకర గాలి వీచి, భారీ వర్షాలు కురిసి, జలప్రళయం వచ్చింది. భూమి మొత్తం నీట మునిగింది. అప్పుడు హరి శ్వేత వరాహ రూపంతో సంద్రంలోకి ప్రవేశించి, పాతాళం వరకు వెళ్లి, మునిగిపోయిన భూమిని పైకి తీసుకొచ్చారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>