News March 30, 2024
వరంగల్ BRS టికెట్ ఎవరికి?
WGL పార్లమెంట్ BRS అభ్యర్థి విషయంలో రోజుకో కీలక మలుపు కొనసాగుతోంది. సిట్టింగ్ అభ్యర్థి దయాకర్‌ను కాదని కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. కానీ, తాను పోటీ చేయనని నిర్ణయం తీసుకొని తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో WGL పార్లమెంట్ టికెట్ కేటాయింపుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇటీవల పార్టీ మారిన బాబు మోహన్, తాటికొండ రాజయ్యతో పాటు పెద్ది స్వప్న పేర్లు వినిపిస్తున్నాయి.
Similar News
News February 5, 2025
వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి
వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
News February 5, 2025
మట్టెవాడ క్రైం కానిస్టేబుల్‌కు ప్రశంసాపత్రం అందజేత
రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ జరిగిన దొంగతనాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన దొంగల వివరాలను సంబంధిత జిల్లాల పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తున్న మట్టెవాడ క్రైం కానిస్టేబుల్ అలీకి వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ప్రశంసా పత్రం అందించారు. కేరళలోని తిరువనంతపురం, కొచ్చికి చెందిన పోలీస్ కమిషనర్లతో పాటు వికారాబాద్ ఎస్పీ అలీని అభినందిస్తూ తెలుపుతూ జారీ చేసిన ప్రశంసాపత్రాలను సీపీ అందజేశారు.
News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.