News April 5, 2025
వరంగల్ CGHSకు సిబ్బందిని నియమించండి: MP కావ్య

కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి రోలి సింగ్‌ను ఢిల్లీలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ CGHS వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం కోసం వైద్య సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని వినతి పత్రం అందించారు. సుమారు 12 వేల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స కోసం దూర ప్రయాణం చేయాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై సానుకూల స్పందించినట్లు తెలిపారు.
Similar News
News November 7, 2025
మన హాకీకి వందేళ్లు.. పూర్వవైభవం సాధిద్దాం

స్వాతంత్య్రానికి ముందే భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన క్రీడ హాకీ. 1925 NOV 7న మన హాకీకి IHF గుర్తింపు లభించింది. ఆ ఘనతకు నేటితో వందేళ్లు. 1926లో తొలి అంతర్జాతీయ పర్యటనకు న్యూజిలాండ్ వెళ్లిన భారత్ 21 మ్యాచుల్లో 18 గెలిచింది. 1958 వరకు వరుసగా ఆరు, 1964, 1980లో ఒలింపిక్స్ స్వర్ణాలు, 1975లో WC సాధించింది. ఆ తర్వాత హాకీ ప్రాభవాన్ని కోల్పోయింది. పదేళ్లుగా పూర్వవైభవం కోసం కృషి జరుగుతోంది.
News November 7, 2025
వరంగల్: అమ్మ, నాన్నకు ప్రేమతో..!

పిల్లలు పుట్టగానే కాదు వాళ్లు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం అని ఒక కవి అన్నారు. ఆమె పుట్టి ప్రయోజకురాలు అవడమే కాకుండా తల్లిదండ్రుల చిరకాల స్వప్నమైన సొంతింటిని గిఫ్ట్‌గా ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పర్వతగిరి(M) కల్లెడకు చెందిన జీవంజి దీప్తి పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి తల్లిదండ్రుల పేరును నిలబెట్టింది. అంతేకాదు, సొంతింటిని హనుమకొండలో కొని ఇచ్చింది.
News November 7, 2025
VKB: మూసీ జన్మస్థలం.. ఔషధ జలధార!

అనంతగిరి అడవి ఔషధ గుణాల నిలయంగా విరాజిల్లుతుంది. అనంతగిరి అడవిలో పెరిగే వేలాది మొక్కల వేర్ల నుంచి వడపోతకు గురయ్యే స్వచ్ఛమైన జలమే మూసీ నదికి ఆధారం. నిజాం కాలంలో టీబీ రోగుల చికిత్సకు ఈ కొండల్లో ఆసుపత్రిని నిర్మించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఇదే. పువ్వుల పుప్పొడి, పచ్చని చెట్ల ఫైటో న్యూట్రియంట్స్‌తో కూడిన స్వచ్ఛమైన గాలి, ఔషధ జలధార ఆరోగ్యానికి సంజీవనిగా పనిచేస్తాయని నాటి వైద్యులు నమ్మేవారు.


