News October 15, 2025
వరంగల్: CM, MLA మధ్య స్నేహం చిగురించేనా..?

WGL రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. చాలా రోజులుగా CM రేవంత్, NSPT MLA మాధవరెడ్డి మధ్య చోటుచేసుకున్న విభేదాలపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతున్న వేళ.. నేడు CM స్వయంగా మాధవరెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, పార్టీ పరంగా కాంగ్రెస్ ఏ కార్యక్రమాలు చేసినా, చివరకు CM WGLకు వచ్చినా MLA హాజరు కాలేదు. నేటితో దానికి ఫుల్ స్టాప్ పడి ఇద్దరి మధ్య స్నేహం చిగురించేనా చూడాలి.
Similar News
News October 15, 2025
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మందాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News October 15, 2025
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం అంటే జాగ్రత్త.!

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు మోసగించే అవకాశాలు ఎక్కువ అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే మంగళవారం ఓ ప్రకటనను పోలీసులు విడుదల చేశారు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలు వస్తాయని వచ్చే మెసేజ్లపట్ల ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.
News October 15, 2025
వరంగల్: ఎన్ని’కల’ చెదిరింది.. ఎదురుచూపు మిగిలింది..!

కొందరు ముందే ఉహించినా.. నామినేషన్ తొలిరోజే స్థానిక ఎన్నికలు వాయిదా పడటం అనూహ్య పరిణామమే. అఫిడవిట్లు, నామ పత్రాలు సిద్ధం చేసుకొని, ముహూర్తం చూసుకున్న నేతలు హై కోర్టు స్టేతో ఉసూరుమన్నారు. కోడ్ ఎత్తేయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో అందరి చూపు అటువైపుకు మళ్లింది. అయితే రిజర్వేషన్లపై అదే సస్పెన్స్ కొనసాగుతోంది.