News February 26, 2025
వరంగల్: MGM ఆస్పత్రి నుంచి పారిపోయాడు..!

వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఈ విషయమై ఆస్పత్రిలో ఉన్న అతడి తల్లి లక్ష్మీ స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన పద్మాకర్ అనారోగ్య రీత్యా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పకుండా ఎంజీఎం నుంచి పారిపోయాడు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే మాట్వాడ పోలీసులకు సమాచార ఇవ్వాలని కోరారు.
Similar News
News February 26, 2025
వరంగల్: HMపై క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్ ఆదేశం

గీసుకొండ మండలం జాన్‌పాక ప్రభుత్వ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను కలెక్టర్ సత్య శారద మంగళారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్ఎం ఎలిజెబత్ రాణి ప్రవర్తనపై పలు ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ పాఠశాల సందర్శించి ఆమె ప్రవర్తనపై ఆరా తీశారు. విద్యార్థులతో, తోటి ఉపాధ్యాయులతో ప్రవర్తన సరిగా లేదని, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించడం లేదని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 26, 2025
వరంగల్: ఎమ్మెల్సీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో బ్యాలెట్ పేపర్ల పరిశీలన, పోలింగ్ సామగ్రి కేంద్రాల వారీగా వేరుచేసి పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది తుది రాండమైజేషన్ కలెక్టర్ నిర్వహించి 13 కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు. పోలింగ్ కేంద్రాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
News February 26, 2025
వరంగల్: ఇంట్లో పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

వరంగల్ కొత్తవాడలో తాళం వేసిన ఇంట్లో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలడంతో అక్కడే నివసిస్తున్న ప్రజలందరూ ఉలిక్కి పడ్డారు. తాళం వేసిన ఇంట్లో అనుమానాస్పద పదార్థాలు పేలినట్లు చర్చించుకుంటున్నారు. ఆందోళనకు గురైన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక మట్టేవాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.