News December 13, 2025

వరంగల్ NIT అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానస్పద మృతి

image

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి వరంగల్ ఎన్ఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి(43) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 23, 2025

పర్యాటక హబ్‌గా నంద్యాల జిల్లా: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

News December 23, 2025

పల్స్ పోలియో 99.33 శాతం కవరేజ్: DMHO

image

గుంటూరు జిల్లాలో DEC 21, 22, 23 తేదీల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో లక్ష్యంగా నిర్ణయించిన 2,14,981 మంది పిల్లలలో 2,13,539 మందికి పోలియో చుక్కలు వేయడంతో 99.33 శాతం కవరేజ్ సాధించినట్లు DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. ఇంకా 1,442 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. మిగిలిన పిల్లలకు, టీకాలు వేసే క్రమంలో పోలియో చుక్కలు పంపిణీ ఏఎన్ఎంల ద్వారా వేయడం జరుగుతుందని DMHO తెలిపారు.

News December 23, 2025

భాకరాపురంలో జగన్ ప్రజాదర్బార్

image

AP: వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయలో ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.